NTV Telugu Site icon

Minister Seethakka: అంగన్వాడి టీచర్లు, హెల్పర్లతో మంత్రి సీతక్క భేటీ

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: సచివాలయంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లతో మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క భేటీ అయ్యారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చే చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకుంటున్నారు. గతంతో పోలిస్తే నాణ్యమైన చీరలు ఇవ్వాలని మంత్రికి అంగన్వాడి టీచర్లు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే.. పలు రకాల డిజైన్ చీరలను చూయించి నచ్చిన చీరను ఎంపిక చేసుకోవాలని అంగన్వాడి టీచర్లను సీతక్క కోరారు. డిజైన్, రంగుల్లో మార్పులు చేయాలని అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు సూచించినట్లు తెలుస్తోంది. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి త్వరలో చీరలు పంపిణీ చేస్తామని సీతక్క చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అమ్మలాగా చిన్నారుల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్న అంగన్వాడి టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు. మీ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే చీరలు ఇవ్వాలని నిర్ణయించామని, మంచి నాణ్యమైన చీరలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారన్నారు.

Winter: శీతాకాలంలో వృద్ధుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలివే!

ఆర్థిక సమస్యలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయినప్పటికీ అంగన్వాడి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తామన్నారు. రిటర్మెంట్ బెనిఫిట్స్ సాంకేతిక సమస్యలు ఆలస్యం అవుతుందని, ఈరోజు ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్కతో చర్చించామన్నారు మంత్రి సీతక్క. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆమె వెల్లడించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది రోజుల్లో జీవో వస్తుందని, అంగన్వాడి సమస్యలను ప్రయారిటీ గా పరిష్కరిస్తున్నామన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాలకు భవనాలు నిర్మిస్తామని, అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు మంత్రి సీతక్క. మహిళలు స్వేచ్ఛగా పనులకు వెళ్లిందుకే క్రష్ లు సహాయపడతాయని, క్రష్ లతో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. క్రష్ లతో అంగన్వాడి సిబ్బందికి ఇబ్బందులు లేవని, అంగన్వాడీలకు అనుబంధంగా క్రష్ లను కొనసాగిస్తామని ఆమె తెలిపారు. అంగన్వాడి సిబ్బంది అంతా చిత్తశుద్ధితో పనిచేయండన్నారు. మంత్రి హామీతో క్రష్ లను స్వాగతిస్తున్నామని అంగన్వాడీ టీచర్లు వెల్లడించారు.

CM Revanth Reddy : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకో ప్రత్యేక అధికారి..

Show comments