Minister Roja: టీడీపీ, జనసేన పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతోంది.. పొత్తులపై పవన్ వ్యాఖ్యలకు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు.. పక్కోడి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ సెటైర్లు వేసిన ఆమె.. జైల్లో ఉన్న ఖైదీతో పొత్తు పెట్టుకున్నాడు.. ఒక దొంగ కోసం పోరాటం చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు. పుష్కరాల్లో ప్రజలు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు..? ముద్రగడకు ఎందుకు అండగా నిలబడలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్యాకేజ్ కోసమే ఇదంతా చేస్తున్నాడు.. సిగ్గు లేకుండా బానిస బతుకు బతుకుతున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్.
Read Also: Sai Rajesh: బేబీ సినిమాకు డ్రగ్స్ నోటీసులు.. డైరెక్టర్ ఏమన్నాడంటే.. ?
వారు జన సైనికులు కాదు.. జెండాలు మోసే కూలీలు అంటూ విమర్శలు గుప్పించారు ఆర్కే రోజా.. ఇక, సపోర్ట్ చేసే వారందరికీ స్కిల్ స్కాంలో వాటాలు ఉన్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. చంద్రబాబు సంతకాలు లేవని అవగాహన లేకుండా అంటున్నాడు.. సీఐడీ చెప్పిన విషయాలు పవన్ కు తెలియడం లేదా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షాతో మాట్లాడి చంద్రబాబును విడిపించవచ్చు కదా..? అని సూచించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. ఇక, సినిమాలో మాత్రమే పవన్ హీరో.. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ లా మారాడు అని ఎద్దేవా చేశారు. సినీ పరిశ్రమలో నువ్వు ఉండడం సిగ్గు చేటు.. కళాకారులుగా మాకు అవమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పందులు గుంపులుగా వస్తాయని.. ఇవాళే పవన్ కల్యాణ్ అంగీకరించాడని దుయ్యబట్టారు మంత్రి ఆర్కే రోజా.