Site icon NTV Telugu

Minister Roja : ఆడుతాం యువత భవిష్యత్‌కు నిదర్శనం

Rk Roja

Rk Roja

రాష్ట్ర క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసులు, ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా శుక్రవారం విశాఖ‌ రైల్వే గ్రౌండ్‌లో ఆడుదాం – ఆంధ్రరాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మీకోసం, మీలో క్రీడా స్ఫూర్తి పెంచడం కోసం మన అందరి జగన్ అన్నా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను ప్రారంభించారన్నారు మంత్రి రోజా. ఆడుతాం ఆంధ్ర మీ భవిష్యత్ కు నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. మండల స్థాయి, జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయికి వచ్చారంటే మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు రోజా. సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వచ్చిన ప్లేయర్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎవరు కూడా తగ్గేది లే అన్నట్టుగా ప్రతిభని కనబరిచారన్నారు. మహిళలు అందరూ కూడా పురుషలకు తీసుపోకుండా క్రీడల్లో రానిస్తున్నారన్నారు.

Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!

రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారులు పీవీ సింధు, శ్రీకాంత్ వంటి ప్లేయర్స్ ఈ స్థాయి నుండి వచ్చిన వాళ్లే అని ఆమె వ్యాఖ్యానించారు. మీరు కూడా భవిష్యత్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారని, పచ్చ ఛానెల్స్, పసుపు పార్టీ లు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టాలన్నారు మంత్రి రోజా. ఆడుదాం ఆంధ్రా ప్రారంభం నుండి కొన్ని పచ్చ ఛానెల్స్ నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని, క్రీడా కిట్స్ మీద సీఎం జగన్ ఫొటోస్ కాకపోతే చంద్రబాబు ఫొటోస్ వేయాలా? మీ ప్రభుత్వం లో ప్రభుత్వ పథకాలపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫొటోస్ వేసారా? అని ఆయన ప్రశ్నించారు. స్పోర్ట్స్ లో రాణించిన వారికి 4 గురుకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చామని, క్రీడల్లో రానిస్తున్న విద్యార్థులకు స్పోర్ట్స్ కోటా లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి రోజా.

IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్ దూరం!

Exit mobile version