NTV Telugu Site icon

Minister RK Roja: హాయ్‌ ఏపీ.. బైబై బీపీ ( బాబు, పవన్) ప్రజల నినాదం..!

Rk Roja

Rk Roja

Minister RK Roja: హలో ఏపీ.. బైబై వైసీపీ.. ఇదే మన నినాదం అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.. వారాహియాత్ర చేస్తున్న ఆయన.. ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్‌, మంత్రలు, వైసీపీ నేతలను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, అదే స్థాయిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తోంది.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఆర్కే రోజా.. పవన్‌ కల్యాణ్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు.. హాయ్‌ ఏపీ.. బైబై బీపీ (బాబు, పవన్‌ కల్యాణ్‌) అనే నినాదాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు అందుకుంటారని తెలిపారామె. ఎన్నికల గుర్తులేదు, జిల్లా అధ్యక్షులు లేరు, 175 స్థానాల్లో అభ్యర్థులు లేరు.. అయినా సీఎం జగన్‌ను తరిమేస్తానని పవన్ కల్యాణ్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు..

Read Also: Nithin: ఐకాన్ స్టార్ ఉండగా… ‘ఐకాన్’ అని పెడితే బన్నీ ఫ్యాన్స్ ఆగుతారా?

ఇక చంద్రబాబు నాయుడును నమ్మే పరిస్థితిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరన్నారు మంత్రి ఆర్కే రోజా.. వీరు స్లోగన్ దగ్గర నుంచి మేనిఫెస్టో వరకు అంతా కాపీ కొడుతున్నారు.. బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే సత్తా కూడా వీరికి లేదంటూ ఎద్దేవా చేశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన మేనిఫెస్టోని పక్కన పెట్టేశాడు.. చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్ ఒక్కడేనని పేర్కొన్నారు.. ఇప్పుడిప్పుడే ఏపీ ప్రజలు బాగున్నారు.. మళ్లీ చంద్రబాబును కొనితెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు.. ఇక, పవన్.. ఒక రోజు సీఎం అవుతాను అంటాడు.. మరో రోజు ఎమ్మెల్యే కావాలి అంటాడు.. ఇప్పుడు గెలవలేను అంటున్నాడు అని రోజా సెటైర్లు వేసిన విషయం విదితమే. పార్టీ పెట్టిన వ్యక్తికి ప్రజలకు ఏమి చేస్తారో క్లారిటీ ఉండాలని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఆమె.. ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పకుండా తమపై చీప్ గా మాట్లాడుతున్నాడని తెలిపారు. తమను కొడతానని చెప్పాడానికే పవన్ పార్టీ పెట్టాడా అని ప్రశ్నించారు. నాకు ఓట్లు వేసే వారే మీటింగ్ కు రావాలని పవన్ అంటున్నాడు.. అన్నీ చేస్తున్న జగన్ ను కాదని పవన్ కు ఎందుకు ఓట్లు వేయాలి అని మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా నాకు భయం లేదన్న ఆమె.. తనకు ఆరోగ్య సమస్య వస్తే జనసేన సైకోలు అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. డెవిల్ ఈజ్ బ్యాక్.. మీ అంతు తేలుస్తాను అంటూ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించిన విషయం విదితమే.