తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండియాగా మార్చింది పుష్ప ది రైజ్ సినిమా. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఇక పుష్ప ది రూల్ కూడా వచ్చేస్తే అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరగడం గ్యారెంటీ. అందుకే సుకుమార్ తో సినిమా అయిపోయాకా మళ్లీ త్రివిక్రమ్ తోనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇంకో డైరెక్టర్ చేతిలో అంత క్రేజ్ ని పెట్టి, అతను బాలన్స్ చెయ్యలేక ఫ్లాప్ ఫేస్ చెయ్యడం ఎందుకు అనే అల్లు అర్జున్-త్రివిక్రమ్ తో కలిసాడు. ఈ ప్రాసెస్ లో ఆల్రెడీ ఓకే చేసిన కొరటాల శివ సినిమాని కూడా అల్లు అర్జున్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ వదిలేసిన ప్రాజెక్ట్స్ లో ‘ఐకాన్’ సినిమా కూడా ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో, వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఈ సినిమా చెయ్యాల్సి ఉంది. అఫీషియల్ గా కూడా అనౌన్స్ ఐకాన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో వేణు శ్రీ రామ్ మరో యంగ్ హీరో నితిన్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు.
అల్లు అర్జున్ కి చెప్పిన కథతోనే వేణు శ్రీ రామ్, నితిన్ సినిమా చేస్తున్నాడా లేక ఇది కొత్త కథేనా అనేది తెలియాల్సి ఉంది. అయితే కథ మారినా టైటిల్ మాత్రం ‘ఐకాన్’ అని పెడుతున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ చెయ్యనంత మాత్రానా ఐకాన్ టైటిల్ ని నితిన్ కి తీసుకోని వెళ్ళలేరు. ఎందుకంటే ఐకాన్ అనేది అల్లు అర్జున్ కి ఇప్పుడు ఇంటి పేరులా మారింది. ఫాన్స్ అంతా అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే అడ్రెస్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నితిన్ ఐకాన్ అని టైటిల్ పెట్టుకునే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫాన్స్ ట్రోల్ చెయ్యడం గ్యారెంటీ. మరి ఇది రూమర్ మాత్రమేనా నిజంగానే వేణు శ్రీరామ్, నితిన్ సినిమాకి ఐకాన్ టైటిల్ ని ఫిక్స్ చేశాడా అనేది చూడాలి.