NTV Telugu Site icon

Minister RK Roja: పవన్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నీ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలి

Minister Rk Roja

Minister Rk Roja

Minister RK Roja: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమ్మాయిల అదృశ్యంపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కాకరేపాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో తప్పిపోయిన అమ్మాయిలు, మహిళలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు బయటపెట్టడంతో.. మరోసారి అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్ చేసింది జనసేన.. అయితే, జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆర్కే రోజా.. ఈ సందర్భంగా మాడియాతో మాట్లాడారు.. పవన్ కల్యాణ్‌ఫై కీలక వ్యాఖ్యలు చేశారు.. పవన్‌ కల్యాణ్‌ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలంటూ బాంబ్‌ పేల్చారు.. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ.. పవన్‌ కల్యాణ్‌కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు మంత్రి రోజా.

Read Also: Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. వరద సాయం, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ

ఇక, హెరిటేజ్ లో గంజాయి.. నారావారిపల్లిలో ఎర్రచందనం దొరుకుతోంది అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి రోజా.. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకడం లేదన్నారు. మరోవైపు.. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడే అంటూ మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టులను పరిశీలించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై గురువారం కూడా మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఏనాడు లేదని మంత్రి విమర్శించారు. సీఎం జగనన్న తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ అందుకుంటున్నారని.. పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసి, అధికారంలో రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడిన విషయం విదితమే.