NTV Telugu Site icon

Minister RK Roja: ఓడించడానికి ఇది మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగనన్న అడ్డా..

Roja

Roja

Minister RK Roja: విపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల లేని వాళ్ళు, ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఓడిస్తామని సవాల్ చేయడం కామెడీగా ఉందన్నారు.. ఓడిస్తాం.. ఓడిస్తాం.. అని చెప్పడానికి మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగన్ అన్న అడ్డా.. ఓడించడం మీ తరం కాదన్నారు.. ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సంక్షేమ సామ్రాట్ అంటూ అభివర్ణించారు.. ప్రజల ఇంటికి వెళ్లి మరి సంక్షేమం అందిస్తున్న ఘనత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో కొలువైన దేవుడు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు మంత్రి ఆర్కే రోజా.

Read Also: Chicken Kurma : చికెన్ తో కుర్మాను ఎప్పుడైనా ట్రై చేశారా?.. టేస్ట్ వేరే లెవల్..

మరోవైపు.. పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేరని మంత్రి ఆర్కే రోజా జోస్యం చెప్పిన విషయం విదితమే.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కళ్యాణ్‌కూ ఏమీ తెలియదని ఎద్దేవా చేసిన ఆమె.. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్థులను పవన్ కళ్యాణ్ సొంతంగా నిలబెట్టాలని సవాల్‌ విసిరారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు నారా లోకేష్‌ కూడా ఎమ్మెల్యేగా గెలవాలని ఓపెన్ ఛాలెంజ్‌ చేశారు. ఇక, మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు చేసిందేమీ లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించిన విషయం విదితమే. కాగా, సీఎం జగన్‌ గ్రాప్‌ పడిపోయింది.. పులివెందులలో కూడా జగన్‌ ఓడిపోతారంటూ చంద్రబాబు జోస్యం చెప్పిన విషయం విదితమే.