Minister RK Roja: ఓడించడానికి ఇది మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగనన్న అడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: విపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల లేని వాళ్ళు, ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఓడిస్తామని సవాల్ చేయడం కామెడీగా ఉందన్నారు.. ఓడిస్తాం.. ఓడిస్తాం.. అని చెప్పడానికి మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగన్ అన్న అడ్డా.. ఓడించడం మీ తరం కాదన్నారు.. ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సంక్షేమ సామ్రాట్ అంటూ అభివర్ణించారు.. ప్రజల ఇంటికి వెళ్లి మరి సంక్షేమం అందిస్తున్న ఘనత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో కొలువైన దేవుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: Chicken Kurma : చికెన్ తో కుర్మాను ఎప్పుడైనా ట్రై చేశారా?.. టేస్ట్ వేరే లెవల్..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మరోవైపు.. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేరని మంత్రి ఆర్కే రోజా జోస్యం చెప్పిన విషయం విదితమే.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కళ్యాణ్‌కూ ఏమీ తెలియదని ఎద్దేవా చేసిన ఆమె.. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్థులను పవన్ కళ్యాణ్ సొంతంగా నిలబెట్టాలని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్‌తో పాటు నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేగా గెలవాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు చేసిందేమీ లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించిన విషయం విదితమే. కాగా, సీఎం జగన్ గ్రాప్ పడిపోయింది.. పులివెందులలో కూడా జగన్ ఓడిపోతారంటూ చంద్రబాబు జోస్యం చెప్పిన విషయం విదితమే.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!