RK Roja Open Challenge: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి ఆర్కే రోజా.. సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్లు చూస్తే చంద్రబాబు గుండెల మీద ఎవరో ఎగిరి ఎగిరి కొట్టినట్లు ఉంటోందని సెటైర్లు వేసిన ఆమె.. చాలా మంది మేం కావాలని, రావాలని అడుగుతున్నారు.. కొంత మంది దొంగతనంగా వెళ్లి స్టిక్కర్లు పీకేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ఛాలెంజ్ చేశారు.. చంద్రబాబు దిగుతున్నది సెల్ఫీలు కాదు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడన్న ఆమె.. చంద్రబాబు ముసిలి నాయకుడు.. మూలన కూర్చోకుండా ఇంకా కుట్రలు పన్నుతున్నాడని ఫైర్ అయ్యారు.. కుప్పంలో అయినా, నగరిలో అయినా నేను సిద్ధం.. నీ మ్యానిఫెస్టో నువ్వు తీసుకుని రా.. మా మ్యానిఫెస్టో నేను తీసుకుని వస్తాను.. నువ్వు చేసిన హామీల్లో ఎన్ని అమలు చేశావు నువ్వు చెప్పు.. మేం చేసిన అభివృద్ధి ఏంటో నేను చెబుతాను.. అప్పుడు ప్రజలు ఎవరితో సెల్ఫీ ఫోటో దిగుతారో చూద్దాం.. సెల్ఫీ ఛాలెంజ్ అంటే అది అని వ్యాఖ్యానించారు మంత్రి రోజా.
Read Also: Arvind Kejriwal: ప్రధానికి వెయ్యి కోట్లు ఇచ్చా.. అరెస్టు చేస్తారా?
చంద్రబాబు ఫెయిల్యూర్ పొలిటీషియన్‌గా వ్యాఖ్యానించారు మంత్రి రోజా… ప్రజలను అప్పుల ఊబిలో నెట్టేసిన చంద్రబాబే క్యాన్సర్ గడ్డగా పేర్కొన్న ఆమె.. యువతను మోసం చేసిన చంద్రబాబు క్యాన్సర్ గడ్డ.. కానీ, జగన్ మనసున్న నాయకుడు… మా నమ్మకం జగన్ అని ప్రజలే చెబుతున్నారు.. నిన్ను నమ్మం చంద్రబాబు అంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలు మా ప్రభుత్వ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం.. జగన్ ను ప్రజలు ఎలా అభిమానిస్తున్నారో మాకు వస్తున్న స్పందన చూస్తేనే అర్థం అవుతుందన్నారు. ప్రజల ఇంటికే వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళుతున్నారు.. మీకు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయని ప్రజలనే నేరుగా అడుగుతున్నారని వివరించారు.. ఏడు లక్షల మంది జగన్ సైనికులు క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్తున్నారు.. 63 లక్షల 93 వేల మంది ఇళ్లకు మా సైనికులు వెళ్లారని.. పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతున్నారని.. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక సంచలనంగా అభివర్ణించారు మంత్రి ఆర్కే రోజా.