Site icon NTV Telugu

RK Roja: బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా..

Rk Roja

Rk Roja

RK Roja: బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని, న్యాయపరంగా పోరాడతానని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలని ఆమె అన్నారు. మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగు మిగిలిపోతారని మంత్రి రోజా పేర్కొన్నారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కిందని అన్నారు. చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఫెయిల్యూర్‌ను కప్పి పుచ్చుకోవడానికి తనను టార్గెట్ చేశారని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు అంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.

Also Read: Chandrababu: చంద్రబాబుకు రేపు అత్యంత కీలకం.. అన్ని కేసుల్లో తీర్పులు సోమవారమే..

మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న బండారు సత్యనారాయణ నీచంగా మాట్లాడారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలిసినంత వరకూ ఎవరూ ఇంతలా ఒక మహిళ గురించి మాట్లాడలేదని ఆమె అన్నారు. తన నియోజకవర్గంలోని, తన ఇంట్లోని మహిళలకు బండారు ఎంత గౌరవం ఇస్తారో అర్థమైందన్నారు. మహిళల పట్ల బండారు సత్యనారాయణకు ఉన్న సంస్కారమేంటో తెలుస్తోందని ఆమె పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న రోజాని అంటే తప్పించుకు తిరగొచ్చని బండారు అనుకుంటున్నారని మంత్రి రోజా వెల్లడించారు. బండారు వంటి మగవాళ్లకు బుద్ధి చెప్పడానికే తాను పోరాటం చేస్తున్నానన్నారు.

 

Exit mobile version