Minister RK Roja: పర్యాటక రంగంలో అనేక మార్పులు.. సింగిల్ విండోలో అనుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మంచి కృషి జరుగుతోంది.. పెట్టుబడిదారులకు సింగిల్ విండో పద్ధతుల్లో అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె.. పర్యాటకులకు విశేష సేవలు అందించిన హోటల్స్ కు అవార్డులు అందించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి.. ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రాంతం మన దేశం అన్నారు. దేశంలో అత్యధిక పర్యాటక అభివృద్ధి గల ప్రాంతంగా ఏపీ మూడో స్థానంలో ఉందని తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేలా 2020-2025 పాలసీ అమలు చేస్తున్నాం అని వెల్లడించారు. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో ఒబేరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. పీపీపీ పద్దతిలో 14 ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నాం.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని వెల్లడించారు. సింగిల్ విండో పద్ధతుల్లో పెట్టుబడి దారులకు అనుమతి ఇస్తున్నామని.. 48 టూరిజం హోటల్స్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండే సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పర్యాటక స్థలాలు కబ్జా కాకుండా పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేస్తాం.. ఏపీ టూరిజం ఫోరమ్ ను ఏర్పాటు చేసి సంస్థాగతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా.
Read Also: MAD Movie : ‘మ్యాడ్ ‘ మూవీ పై జాతిరత్నాలు డైరెక్టర్ ప్రశంసలు..
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం