MAD Movie : ‘మ్యాడ్ ‘ మూవీ పై జాతిరత్నాలు డైరెక్టర్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి రెడీ అవుతుంది..అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది..రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు..
సినిమా విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచారు..మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ మంగళవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు చిత్రం బృందంతో పాటు, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సినిమాలో అనుదీప్ కూడా నటించడం విశేషం..
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
ఈ సందర్బంగా డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. దర్శకుడు కళ్యాణ్ నాకు పదేళ్లుగా స్నేహితుడు. కళ్యాణ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఎప్పుడూ మంచి కథలు రాస్తుంటాడు. ఈ సినిమా చాలా ఎనర్జీతో, చాలా హ్యూమర్ తో ఉంటుంది. కొత్తవాళ్ళని ప్రోత్సహిస్తూ నాగవంశీ గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.. 6 న సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.. జాతిరత్నాలు కన్నా ఈ సినిమా సూపర్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు..
అనంతరం నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. జాతిరత్నాలు కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. సినిమా పట్ల అంత నమ్మకం ఉంది. ఇది యూత్ ఫుల్ సినిమా అయినప్పటికీ, కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది అని నిర్మాత అన్నారు..
ఇక ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు సినిమా గురించి చెప్పారు.. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మ్యాడ్ చిత్రంలోని పాటలను పాడి ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. అక్టోబర్ 6న విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు… మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..