Site icon NTV Telugu

Gottipati Ravi Kumar: గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం? మంత్రి సంచలన ఆరోపణలు

Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. ప్రచార పిచ్చితో ఓ పత్రికకు రూ. 1,600 కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి బొక్కేసిన ఎగ్ పఫ్‌ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లన్నారు.

READ MORE: Bandi Sanjay : సీఎం హామీలు అమలు కాలేదంటే… ముఖ్యమంత్రి పదవికే కళంకం

ఇవన్నీ చాలవన్నట్లు అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల్లోనూ చేతి వాటం చూపారని మంత్రి రవికుమార్ ఆరోపించారు. రూ. పది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేశారన్నారు. ఆరోగ్య శ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజ్ రియంబర్స్మెంట్లకు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 22 వేల కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపుపాలన కారణంగా రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని దుస్థితి దాపురించిందని విమర్శించారు. జగన్ రెడ్డి చేసిన అప్పులకు కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.71 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు.

READ MORE: Central Cabinet Decisions: నేషనల్ క్రిటికల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం.. ఎన్ని కోట్లు కేటాయించారంటే..!

Exit mobile version