NTV Telugu Site icon

Ponnam Prabhakar: కాంగ్రెస్ వచ్చాక కరువు రాలేదు: పొన్నం ప్రభాకర్

Ponnam

Ponnam

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు రాలేదని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తుందని, మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగండని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన వద్ద తాము ఓట్లు అడుగుతాం అని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి.. మనకు రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటామన్నారు.

Also Read: MS Dhoni Batting: రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు రాని ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ‘బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ వచ్చాక కరువు రాలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగండి, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన వద్ద మేము ఓట్లు అడుగుతాం. రైతు బందు అందరికీ ఇస్తాం. గతంలో రైతుబందు మార్చ్ నెల వరకు ఇచ్చారు. రాష్ట్రం 7లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. 40వేల కోట్ల బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. రైతులపై మీకు చిత్త శుద్ది ఉంటే రండి.. మీరు, మేము చేసిన వాస్తవాలు ప్రజలకు చెబుదాం. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి.. కేంద్రం నుండి రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటాం’ అని అన్నారు.