రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశాం అని, మిస్ అయిన వారి కోసం మరో అవకాశం ఇస్తున్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది రీసర్వే కాదని, ఇది మిస్ అయిన వారికోసం మాత్రమే అని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ విమర్శల కొసమే బీసీ ముస్లింల మీద బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌లోని మూడు పదవులలో ఒకటి బీసీకి కెటాయించే విధంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు .
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేశాం. మిస్ అయిన వారి కోసం మరో అవకాశం ఇస్తున్నాం. ఇది రీసర్వే కాదు.. ఇది మిస్ అయిన వారికోసం మాత్రమే. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదు. బీజేపీ వ్యాపారస్థుల పార్టీ, వారికి రిజర్వేషన్లు ఇష్టం లేదు, కులగణనకి వారు వ్యతిరేకం. రిజర్వేషన్ల విషయంలో తాము వ్యతిరేకం అని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన పార్టీ బీజేపీ. ఎన్నికలు సర్వే తర్వాతనే జరుగుతాయి’ అని మంత్రి పొన్నం చెప్పారు.
Also Read: Himayatnagar Robbery: హిమాయత్ నగర్‌లో భారీ చోరీ.. రెండు కోట్ల రూపాయల నగలు మాయం!
‘ప్రజాస్వామ్యం మీద మీకు విశ్వాసం ఉంటే సర్వేలో పాల్గొనాలి. రాజకీయ విమర్శల కొసమే బీసీ ముస్లింల మీద బీజేపీ వారు విమర్శలు చేస్తున్నారు. ముస్లిం కమ్యూనిటీలోని పేద ముస్లింలు చాల రోజుల నుండి బీసీలోనే ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వేని ఎందుకు బయటపెట్టలేదు. బీఆర్ఎస్‌లోని మూడు పదవులు ఒక బీసీకి కెటాయించే విధంగా కల్వకుంట్ల కవిత గారు చర్యలు తీసుకోవాలి. కవితక్క మూడు పదవులలో బీసీలకి కెటాయించేలా కరీంనగర్ నుండే ఉద్యమం చేయాలి. రాహుల్ గాంధీ పర్యటన మీద దుష్ప్రాచారం చేయాలని చూస్తున్నారు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.