Site icon NTV Telugu

Minister Ponnam Prabhakar: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాప్‌లో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో నేడు 17,263 చాకధరల దుకాణాల ద్వారా 2 లక్షల 91 వేలకు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నపు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారుకే ఐదుకో పదుకో ఇచ్చే పరిస్థితి ఉండేదని చెప్పారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు బియ్యాన్ని తప్పకుండా తీసుకుంటారని చెప్పారు.

READ MORE: Gold Rate Today: అయ్య బాబోయ్‌ ‘బంగారం’.. 93 వేలకు చేరుకున్న పసిడి!

దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. కరీంనగర్ కి నీటి సమస్య రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కిందనున్న పంటలు ఎండకుండా ఏప్రిల్ ఆరు వరకి నీటి విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వాగ్దానాలని ఒక్కోక్కటిగా పూర్తి చేస్తామని… రాజీవ్ యువవికాస్ ద్వారా యువకులకి అండగా నిలుస్తామన్నారు.

READ MORE: Suryakumar Yadav: టీ20 క్రికెట్‌‌లో సూర్యకుమార్ చరిత్ర.. మొదటి ఆటగాడిగా అరుదైన రికార్డు!

Exit mobile version