NTV Telugu Site icon

Minister Ponnam Prabhakar: జనావాస సముదాయాల్లో టపాసుల దుకాణాలు లేకుండా చూడాలి..

Minister Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar: జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రం మొత్తం, జంట నగరాల్లో టపాసుల దుకాణాలు చిన్న చిన్న గల్లిల్లో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని అబిడ్స్‌తో పాటు యాకత్ పురాలోని చంద్ర నగర్‌లో టపాసుల దుకాణాల వల్ల రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి… అదృష్టవశాత్తూ పెద్దగా ప్రమాదం జరగలేదన్నారు.

Read Also: Diwali At Ayodhya: 500 ఏళ్ల తర్వాత నేడు అయోధ్యలో దీపావళి సంబరాలు.. ఏకంగా 28 లక్షల దీపాలతో

టపాసుల దుకాణాల వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ టపాసుల దుకాణాలని మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా అధికారులను అదేశిస్తున్నామన్నారు. వెంటనే ఎక్కడైనా చిన్న చిన్న గల్లిల్లో, జన నివాస ప్రాంతాల్లో, వ్యాపార ప్రదేశాల్లో ఎలాంటి టపాసుల దుకాణాలు నిర్వహించే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని ఖాళీ ప్రదేశాలు, క్రీడా మైదానాలు, పాఠశాల మైదానాలను టపాసులు దుకాణాలకు వాడుకోవాలన్నారు.ఎక్కడైనా నివాస ప్రాంతాల మధ్య టపాసుల దుకాణాలు ఉంటే సంబంధిత ఏరియా అధికారి బాధ్యత వహించాలన్నారు. ప్రమాదాలు నివారించడానికి దానిని అందరి సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా జనావాసాలు, నివాస సముదాయాల్లో టపాసులు అమ్ముతుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని కోరుతున్నామని మంత్రి సూచించారు.