Minister Ponnam Prabhakar: జనావాస సముదాయాల్లో టపాసుల దుకాణాలు లేకుండా చూడాలి..
- రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దీపావళి శుభాకాంక్షలు
- జనావాసాల్లో టపాసుల దుకాణాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponnam Prabhakar: జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రం మొత్తం, జంట నగరాల్లో టపాసుల దుకాణాలు చిన్న చిన్న గల్లిల్లో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని అబిడ్స్‌తో పాటు యాకత్ పురాలోని చంద్ర నగర్లో టపాసుల దుకాణాల వల్ల రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి… అదృష్టవశాత్తూ పెద్దగా ప్రమాదం జరగలేదన్నారు.
Read Also: Diwali At Ayodhya: 500 ఏళ్ల తర్వాత నేడు అయోధ్యలో దీపావళి సంబరాలు.. ఏకంగా 28 లక్షల దీపాలతో
Also Read
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
టపాసుల దుకాణాల వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ టపాసుల దుకాణాలని మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా అధికారులను అదేశిస్తున్నామన్నారు. వెంటనే ఎక్కడైనా చిన్న చిన్న గల్లిల్లో, జన నివాస ప్రాంతాల్లో, వ్యాపార ప్రదేశాల్లో ఎలాంటి టపాసుల దుకాణాలు నిర్వహించే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని ఖాళీ ప్రదేశాలు, క్రీడా మైదానాలు, పాఠశాల మైదానాలను టపాసులు దుకాణాలకు వాడుకోవాలన్నారు.ఎక్కడైనా నివాస ప్రాంతాల మధ్య టపాసుల దుకాణాలు ఉంటే సంబంధిత ఏరియా అధికారి బాధ్యత వహించాలన్నారు. ప్రమాదాలు నివారించడానికి దానిని అందరి సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా జనావాసాలు, నివాస సముదాయాల్లో టపాసులు అమ్ముతుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని కోరుతున్నామని మంత్రి సూచించారు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!