ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం షురూ అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో.. 33 జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించామని.. ఇందిరమ్మ యాప్ ద్వారా ఇప్పటికే 32 లక్షల దరఖాస్తులు పరిశీలించామని తెలిపారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తామని.. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తామన్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక సర్వేపై అధికారులతో చర్చించారు. అనంతరం.. కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: JK: విషాదం.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్ల మృతి
ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి సర్వే పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంతంగా స్థలం ఉంటే ప్రాధాన్యం ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వేయదని అన్నారు. ఎలాంటి ప్రలోభాలు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉండొద్దని చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో ఒక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాగా.. ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్, వెబ్‌సైట్ ను సంప్రదించాలన్నారు.
Read Also: Srisailam Temple: జనవరి 1న శ్రీశైలంలో స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలు నిలిపివేత