Site icon NTV Telugu

Minister Ponguleti: పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం

Ponguleti

Ponguleti

గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ & గృహ నిర్మాణ సంస్థ ఎండీ విజయేంద్ర బోయి, గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

RSS: వివాదాస్పద మత స్థలాలను హిందువులకు అప్పగించండి.. ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు..

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖాయం చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి మూడు లేదా నాలుగు నమూనాలతో ప్లాన్లు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థను పునరుద్ధరణ చేస్తూ.. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి ఇంకను అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై కూడా తీసుకోనే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయవలసిందిగా సంబంధిత సెక్రటరీని మంత్రి ఆదేశించారు.

Congress: రాహుల్ గాంధీ బాటలో ప్రధాని మోడీ.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..

ఈ బృహత్ కార్యక్రమానికి అవసరం అయిన నిధుల సమీకరణ కొరకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని.. అందుకు తగినట్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మంత్రి పొంగులేటి ఆదేశించారు. టెండర్లు ఖరారు చేసి నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయుటకు అవసరం అయిన నిధుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు.. రాజీవ్ స్వగృహ ద్వారా అభివృద్ధి చేయబడిన ఆస్తుల గురించి మంత్రి ఆరా తీశారు. విక్రయించబడని ఆస్తులను తగిన ధరలతో మార్కెట్ చేయడానికి, విక్రయించడానికి వృత్తిపరమైన బృందాలను నియమించాలని ఆదేశించారు. కాగా.. సెమీఫినిష్డ్ టౌన్‌షిప్‌లను సరి అయిన ధరలకు కేబినెట్‌లో చర్చించి విక్రయించేందుకు తగిన నిర్ణయం తీసుకోనున్నారు. అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం పేదల ఇందిరమ్మ హౌసింగ్ కోసం ఉపయోగించబడుతుంది. అందుకోసం.. గృహ నిర్మాణ మండలి ఆస్తుల సమగ్ర వివరాలు సిద్దం చేయాలని మంత్రి కోరారు

Exit mobile version