NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తుంది..

Ponguleti

Ponguleti

INTUC: సత్తుపల్లి సింగరేణి ఎన్నికల్లో భాగంగా ఐఎన్టీయూసీ కార్మికులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2017 సింగరేణిలో గెలిచి మొన్నటి వరకు పారిపాలించిన పార్టీ తరుపున పొరాడం.. అప్పటి ముఖ్యమంత్రి వాగ్దనాలు నమ్మి గెలిపించి మోసపోయాం.. మీ అందరి దీవెనలతో మొన్నటి ఎన్నికల్లో సింగరేణి ఏరియాల్లో ఘన విజయం సాదించాం.. ఆ నాటి ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల సమస్యలు చెబుదామని వెళ్ళిన పట్టించుకోలేదు.. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.. మేమే సమస్య పరిష్కారం చేసే స్థాయిలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికలు జరగకుండా కోర్టులో కేసులు వేస్తే స్టే తెచ్చుకొని గత సీఎం కాలం వెల్లదీశాడు.. గతంలో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయ్యాని వాళ్ళు ఇప్పుడు ప్రతి పక్షంలో మళ్ళీ అదే వాగ్దనాలతో మీ ముందుకు వస్తున్నారు జాగ్రత్త అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read Also: Thalapathy 68 : ఫెస్టివ్ సీజన్ ను ఎంజాయ్ చేయండి.. దళపతి 68 అప్డేట్స్ పై స్పందించిన వెంకట్ ప్రభు..

అధికారంలో ఉన్నప్పుడు పరిష్కారం చెయ్యని వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా చేస్తారో మీరే ఆలోచించాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆశయం ఆశయాలను నెరవేరలాంటే ఐఎన్టీయూసీని భారీ మెజారిటీతో గెలిపించాలి.. ప్రతి పక్షంలో ఉన్న వారి మాటాలు నమ్మి వారికి ఓటేద్దామా.. కామ్యూనిస్ట్ అధికారంలో లేని వారికి ఓటు వేద్దామా మీ ప్రభుత్వం మీ శ్రీనన్న ఉన్న దానికి ఓటు వేద్దామా ఆలోచించండి అని ఆయన చెప్పారు. సింగరేణి ఆవిర్భవ దినోత్సవాన్ని డిసెంబర్23న సెలవు ప్రకటించే విధంగా ఆదేశాలు ఇస్తాం.. సింగరేణి కార్మికుల కోసం మూడు సూపర్ స్పేషాలిటి హస్పటల్స్ నిర్మాస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Minister Sridhar Babu: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందే బీఆర్ఎస్..

సత్తుపల్లి ఓసీలో అత్యధికంగా ప్రోడక్షన్ ఇస్తుంది అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ సత్తుపల్లిని ఏరియాగా అభివృద్ధి చేస్తాం.. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వస్తున్న కార్మికులకు బస్సులు ఏర్పాటు చేస్తాం.. సింగరేణితో సహ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. వాటిన్నంటిని భర్తీ చేస్తాం.. బీజేపీ పార్టీ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరంగా చెయ్యాలని చూస్తుంది.. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కానివ్వం.. అందరు కష్ట పడి పని చేయ్యండి.. ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి.. కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పని చెయ్యండి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.