ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. చెంచులకు 9200 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఐటిడిఎ ప్రాంతంలో ఉండే నియోజక వర్గాలకు అదనంగా ఇస్తున్నామని వెల్లడించారు. 2 లక్షల 10 వేల ఇండ్లు అర్హుల జాబితా ఫైనల్ అయ్యిందని ప్రకటించారు. 24 వేల ఇండ్లు నిర్మాణం ప్రారంభం అయ్యిందని.. నిర్మాణానికి రూ. 130 కోట్లు చెల్లించామని తెలిపారు. పారదర్శకంగా అర్హుల ఎంపిక చేస్తున్నామని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సమాన స్థాయిలో ఇండ్లు కేటాయింపులు జరుగుతున్నాయన్నారు.
READ MORE: MP Laxman: పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం?.. రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఫైర్..
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలో కూడా 40 శాతం.. అధికారులతో విచారించి ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేటీఆర్ లాంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వలేదన్నారు.. వాళ్ళనే ఎంపిక చేసుకోండి అని అన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నేపథ్యంలో ధరల నియంత్రణకు ఒకటి రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేస్తామని, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పని చేస్తుందన్నారు. స్టీల్ రేటు ఏడాది క్రితం నుంచి ఎలా ఉందో అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్.. వరంగల్.. ఖమ్మం.. మహబూబ్ నగర్.. నల్గొండ జిల్లా కేంద్రాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ స్థలంలో కబ్జాలో ఉన్న వాళ్లకు పట్టాలు ఇచ్చి ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
READ MORE: PM Modi: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని
