Peddireddy Ramachandra Reddy: కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల.. హాట్ కామెంట్లు చేసిన మంత్రి పెద్దిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువకు కాంగ్రెస్ దిగ్గజాల సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. అంతేకాదు.. ఏపీలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ సాగుతోంది. అయితే, ఈ పరిణామాలపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు. ఇక, రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం.. సీఎం వైఎస్ జగన్ మా నాయకుడు ఆయన కోసం మేం ఎప్పటికీ పని చేస్తూనే ఉంటాం అన్నారు.
Read Also: YS Sharmila: మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నా.. సంతోషంగా ఉంది
Also Read
కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్ ను గెలిపించాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ప్రత్యర్థిగా చూస్తాం అన్నారు. మరోవైపు, జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేం ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలన్నారు. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు అని.. ఇప్పటికైనా అయన పునరాలోచలో చేయాలని కోరుకుంటున్న.. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో మా నాయకుడు వైఎస్ జగన్ పై అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైలుపాలు చేశారని మండిపడ్డారు. అందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అని కామెంట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు