Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy: ఆయనకే గ్యారెంటీ లేదు.. ఆయన ఇచ్చే గ్యారెంటీలను ఎవరు నమ్ముతారు..?

Peddireddy On Chandrababu

Peddireddy On Chandrababu

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ఇక, ఆయన ఇచ్చే గ్యారెంటీని ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. వచ్చే నెల 3న అనంతపురంలో జరిగే సిద్ధం కార్యక్రమ పోస్టర్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సమావేశంలో సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సమాయత్తం అవ్వాలని పిలుపునిచ్చారు. గురుమూర్తి ఉప ఎన్నికలో విజయం సాధించారు.. రానున్న ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారు.. సత్యవేడు నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో గురు మూర్తి విజయానికి కృషి చేయాలని సూచించారు.

Read Also: RGV: చిరంజీవికి పద్మ పురస్కారం.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తాను

ఇక, రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకం అయ్యాయి.. చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.. ఆమెపై గౌరవం ఉంది.. కానీ, ఆమె చంద్రబాబు చేసే విమర్శలే చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల జాడ లేకుండా పోయిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అనంతరపురంలో ఫిబ్రవరి 3వ తేదీన సిద్ధం కార్యక్రమంలో పాల్గొంటారు.. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 29న తిరుపతిలో నిర్వహిస్తాం అన్నారు. మరోవైపు.. పీలేరు సభలో చంద్రబాబు అన్నీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఇలాంటి వ్యక్తి మన జిల్లాలో ఎలా పుట్టాడో అంటూ హాట్‌ కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పేవి అన్నీ అబద్ధాలే, ప్రజలు ఎవరు నమ్మవద్దు అని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలో లేనప్పుడు మరోమాట చంద్రబాబు నైజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Exit mobile version