Peddireddy Ramachandra Reddy: వీలుకాని హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుపాటు తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో పని చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుదే అని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో నేడు సూపర్ సిక్స్… మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ.. అంటూ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అమలు చేయడానికి వీలుకాని హామీలు చంద్రబాబు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: Delhi metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
కాగా, మంచి చేశారు కాబట్టే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారన్నారు.. చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో వృధా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారని గతంలో మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించిన విషయం విదితమే.. 2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదని.. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు టీడీపీ వారికి మాత్రమే పథకాలు అందించారని.. కానీ, పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ సొంతమన్నారు… జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత సుపరిపాలన అందిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే.