NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: టీడీపీది విష ప్రచారం.. జగన్, చంద్రబాబు పాలన బేరీజు వేసుకుని ఓటు వేయండి..

Minister Peddireddy Ramachandra Reddy

Minister Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy: శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కొనసాగుతోంది.. ముఖ్యంగా హిందూపూర్‌ నియోజకవర్గంపై ఫోకస్‌ చేశారు పెద్దిరెడ్డి.. ఒకేసారి ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి పర్యటించడం ఆసక్తికరంగా మారగా.. టీడీపీని టార్గెట్‌ చేస్తూ ముందుకు సాగుతున్నారు మంత్రి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99.5 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిదే అన్నారు. కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్.. హైదరాబద్ లో దాక్కున్నారని దుయ్యబట్టారు.

Read Also: Chlorine Gas Leak: ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన పెను ప్రమాదం!

ఇక, సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్కడా కులాలు, మతాలు, పార్టీలు చూడలేదు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందించారని ప్రశంసలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి.. పాలన అంతా ప్రజల ఇంటి ముందు ఉన్న సచివాలయంలోనే ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లాగా జన్మభూమి కమిటీలను వేసి ప్రజల్ని దోచుకునే పరిస్థితి లేదు.. నేరుగా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు.. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా.. సీఎం బటన్‌ నొక్కి లబ్ధిచేకూరుస్తున్నారని తెలిపారు. మరోవైపు.. పెన్షన్ లు పెంచి రూ.3,000 చేస్తే… పెన్షన్ ఇవ్వరు అంటూ టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ , చంద్రబాబు పాలన బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.