NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: ఈ పాపమంతా చంద్రబాబుదే.. అనుభవించక తప్పదు..

Minister Peddireddy Ramachandra Reddy

Minister Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పైచంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ల్యాండ్ ఓనర్లకు మంచి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. చిలువలు పలువులుగా మాట్లాడుతూ స్వప్రయోజనానికి తీసుకొచ్చారంటున్నారని ఆయన ఆగ్రహించారు. రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి భూములంతా తీసుకుంటాడా.. ఇలాంటి మాటలు విపక్షాలకు తగవన్నారు.

ఈ యాక్ట్ పేదల కోసం ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ కోసమే తెచ్చామన్నారు. ఈ యాక్ట్‌ను ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప రద్దు చేయమన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు.. ఈ యాక్ట్‌ రద్దు చేసేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఒకటో సంతకం, రెండో సంతకం అంటున్నారని ఎద్దేవా చేశారు. పెన్షన్లు అందక ఓ వృద్ధుడు గ్రామ సచివాలయానికి వెళ్లి వడదెబ్బతో చనిపోయాడని.. ఈ పాపాలన్నీ చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతున్నాయన్నాని విమర్శించారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి ఆపించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కుట్రపూరితంగా నిమ్మగడ్డ రమేష్‌తో ఈ పిటిషన్ వేయించారని.. ఈ పాపమంతా చంద్రబాబుకే చెందుతుందని ఆరోపించారు.

Read Also: Tirumala: తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం 34 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవారని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 66 లక్షల పెన్షన్లు ఇచ్చారన్నారు. 66 లక్షల మందికి ఏకకాలంలో బ్యాంకుల్లో పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. వాలంటరీల వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. వాలంటీర్లు వ్యవస్థ లేకపోవడంతో వృద్ధులంతా ఎండలకు పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారని మంత్రి చెప్పారు. ఈ పాపమంతా చంద్రబాబు నాయుడుదేనని.. తప్పనిసరిగా ఈ ప్రాయశ్చితాన్ని ఆయన అనుభవించక తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.