NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం..

Peddireddy On Chandrababu

Peddireddy On Chandrababu

Peddireddy Ramachandra Reddy: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్‌ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబుకు కుప్పంలో ప్రజలు బుద్ధి చెపుతారన్నారు. ఈ ర్యాలీ చూసాక భరత్ కచ్చితంగా విజయం సాధిస్తారని అర్థమవుతుందని మంత్రి తెలిపారు. ఎంపీగా రెడ్డప్పను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామన్నారు. ఉమ్మడి జిల్లాకు ఎప్పుడూ వచ్చిన చంద్రబాబు తనపై విమర్శలు చేస్తున్నారని.. చంద్రబాబుకు ప్రజలు ఓట్లు ద్వారా బుద్ది చెప్తారన్నారు. కుప్పం ప్రజలు ఎవరూ చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేదన్నారు. 35 ఏళ్లుగా మనల్ని మోసం చేస్తూ వస్తున్న చంద్రబాబును నమ్మితే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడన్నారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Read Also: YS Jagan Stone Pelting Case: సీఎం జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడు సతీష్‌ కస్టడీకి కోర్టు అనుమతి