NTV Telugu Site icon

Minister Parthasarathy: అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్‌పై చర్యలు తీసుకుంటాం..

Minister Parthasarathy

Minister Parthasarathy

Minister Parthasarathy: అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ఆగస్టు 1నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీపై తప్పుడు కూతలు మానుకోవాలన్నారు. గత ప్రభుత్వ చేతగాని తనంతోనే అప్పుల ఊబిలో రాష్ట్రం ఉందని. బిల్లులు కట్టకపోవడంతో నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ నిలిపివేశాయని ఆయన అన్నారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్‌ది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

Read Also: Srisailam Inflow: శ్రీశైలానికి తగ్గిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల

టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీలు ఈ రాష్ట్రాభివృద్ధికి, ప్రజా ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. జగన్ అధికారంలో ఉండగా ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలన్నారు. అసెంబ్లీకి రాకుండా అబద్దపు.. గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Show comments