Site icon NTV Telugu

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. వారికి గుడ్‌న్యూస్‌..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో.. 9 అంశాలపై చర్చించారు.. ఇక, బార్‌ లైసెన్స్‌ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. యువజన, పర్యాటక శాఖలో జీవోల ర్యాటిఫికేషన్‌కు మంత్రవర్గం ఆమోదం తెలిపింది.. ఏపీ మీడియా అక్రిడేషన్‌ నిబంధనలు – 2025కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. సాగర్‌ లెఫ్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.. జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.. జలహారతి కార్పొరేషన్‌ ద్వారా పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ రూపకల్పన చేయనున్నారు.. ఇక, రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు..

Read Also: Siddu – Bhaskar: సిద్దు – భాస్క‌ర్ మ‌ధ్య గొడ‌వపై క్లారిటీ

కేబినెట్‌ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారధి.. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఊహాజనిత హామీలు లేకుండా ముందుకు వెళ్తున్నాం. ఆర్స్ లి మిట్టల్ నిస్సార్ ఇండియా లిమిటెడ్.. స్టీల్ ఉత్పత్తికి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. క్యాపిటివ్ పోర్ట్ కావాలని నిస్సార్ ఇండియా లిమిటెడ్ కోరింది.. స్టీల్ ప్లాంట్ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టే అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.. టెంపుల్ టూరిజం డెవలప్‌ చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. త్రి స్టార్ హోటళ్లలో రూమ్ లు పెరగాలి.. టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. బార్ లైసెన్స్ లు 25 లక్షలకు తగ్గిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు..

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం

పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించి జల హారతి కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదించిందన్నారు మంత్రి పార్థసారథి.. సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. ప్రతి ఏడాది వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల నీరు వృధాగా పోతోంది.. రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు జరుగుతోంది. అధికారులు పల్లెల్లో ఉండి పరిస్థితి.. సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు.. అధికారుల నివేదిక తర్వాత గ్రామీణాభివృద్ధికి ఏమి చేయాలి అనే అంశం పై ప్రభుత్వం దృష్టి పెట్టనుందన్నారు.. అన్ని మత విశ్వాసాలు గౌరవించడం ప్రభుత్వ లక్ష్యం. వక్ఫ్ బిల్లు లపై మార్పులకు సంబంధించి ఇప్పటికే టీడీపీ సూచించిందని గుర్తుచేశారు మంత్రి కొలుసు పార్థసారథి..

Exit mobile version