Singireddy Niranjan Reddy : మీ గత పాలనలో రైతుల పడ్డ గోస గుర్తు చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల పేరిట రాజకీయం వద్దని, నాలుగేళ్లలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని సమస్యల మీద ఎన్ని దీక్షలు చేశారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అకాలవర్షాలకు పంటనష్టంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖపై స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి… అకాలవర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నదని, అకాలవర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగిందని, వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారన్నారు.
Also Read : Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన ముప్పు
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే రాజకీయ దీక్షలను రైతులు గమనిస్తారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి ఒక ప్రజాప్రతినిధిగా కోమటిరెడ్డి గాని మరొకరు గాని తీసుకురావడం తమ బాధ్యత అన్నారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అలోచన సబబు కాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ అనుకూల విధానాలతో దేశంలోనే అగ్రగామిగా సాగుతున్నదని, ప్రభుత్వ చర్యల మూలంగా ఈ యాసంగిలో 56.44 లక్షల ఎకరాలలో వరి సాగవుతున్నదని, రైతుబంధు, రైతుభీమా, ఉచితకరంటు, సాగునీటి కల్పనతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.
Also Read : Telangana: చైల్డ్ పోర్న్ చూస్తే జైలుపాలే.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక
ప్రతి ఏటా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయని, దేశంలో సగటు ఉత్పత్తిలో ప్రథమ స్థాయిలో ఉన్నామన్నారు. తెలంగాణ వరి ధాన్యం కొనమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబితే ఒక్క కాంగ్రెస్ నేత ఎందుకు ప్రశ్నించలేదు ? ఎందుకు దీక్షలు చేయలేదు ? అని ఆయన ప్రశ్నించారు. అకాలవర్షాలతో వచ్చిన పంటనష్టం మీద రాజకీయం చేయడం దురదృష్టకరం. మీ గత పాలనలో రైతుల పడ్డ గోస గుర్తు చేసుకోండని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!