NTV Telugu Site icon

Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నిమ్మల

Nimmala

Nimmala

Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాoటీన్లు ప్రారంభిస్తున్నాం అని వెల్లడించిన ఆయన.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం అన్నారు.. పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామని వెల్లడించారు.. అయితే, అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటంట్ పొందిందని ఎద్దేవా చేశారు.. 2019లో వచ్చిన మూడంకెల సీట్లు 2024లో డబుల్ డిజిట్ కు పడిపోయినా వైసీపీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు.

Read Also: International Monetary Fund : పాక్ కు భారీ ఉపశమనం.. రుణ ప్యాకేజీకి అంతర్జాతీయ ద్రవ్య నిధి గ్రీన్ సిగ్నల్

ఇక, ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే ఫించన్, ఇసుక, తల్లికి వందనం వంటి పథకాలపై విష ప్రచారం మొదలుపెట్టిన వైసీపీకి ఈసారి సింగిల్ డిజిట్టే అంటూ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి నిమ్మల.. అమ్మఒడి ఇద్దరు పిల్లలున్నా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పింది జగన్ కాదా..? అని ప్రశ్నించారు. మేం ఇంకా తల్లికి వందనం విధి విధానాలు రూపొందించక ముందే అసత్యాలు మొదలు పెట్టారు. అమ్మఒడి ని మోసం దగాతో కేవలం 4సార్లు మాత్రమే ఇచ్చి ప్రతీ ఏటా ఇస్తానన్న మొత్తాన్ని కూడా కుదించేశారు.. అమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైసీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అటూ ఫైర్‌ అయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు.