NTV Telugu Site icon

Minister Rama Naidu: గత ఐదేళ్ల పాలనలో పోలవరం 20 ఏళ్లు వెనక్కి పోయింది..

Minister Nimmala Rama Naidu

Minister Nimmala Rama Naidu

Minister Nimmala Rama Naidu: ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. డయాఫ్రం వాల్ ఉందో లేదో తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫేజ్ – 1, ఫేజ్ – 2 అని ఏ రోజూ మేం చెప్పలేదన్నారు. పోలవరంతో పాటుగా చింతలపూడి, హంద్రీనీవాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్‌ను విధ్వంసం చేయడమే లక్ష్యంగా పని చేశారని విమర్శించారు.

Read Also: AP Legislative Council: ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజును తిరిగి గుర్తించిన ఏపీ శాసనమండలి

2014-19 గత టీడీపీ పాలనలో 7 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే రూ.72 వేల కోట్లు ఇరిగేషన్‌కు కేటాయించామన్నారు. గత ఐదేళ్ల పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఇరిగేషన్‌కు 38 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో పోలవరం 20 ఏళ్లు వెనక్కి పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌కు విడుదల చేసిన నిధులను గత ప్రభుత్వంలో డైవర్ట్ చేశారన్నారు. గత ఐదు నెలల్లోనే వారానికి రెండు సార్లు రివ్యూ పెట్టుకుంటూ ఇరిగేషన్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి రామానాయుడు తెలిపారు. నదుల అనుసంధానం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Show comments