Minister Narayana: నెల్లూరులో నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాలు, కార్పొరేటర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన చేశారని.. ఐదేళ్లపాటు నియంత పాలన కొనసాగిందని ఆయన విమర్శించారు. అందువల్లే ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలోని నాలుగు పంచాయతీలకు అవార్డులు.. అభినందించిన పవన్ కల్యాణ్
నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా పార్కులు.. సెంట్రల్ డివైడర్లను సుందరీకరిస్తామన్నారు. నెల్లూరుకు చెందిన దాతల సహకారాన్ని కూడా తీసుకుంటామన్నారు. పార్కులను దత్తత తీసుకోవాలని కోరుతున్నామని.. కొత్తగా 16 పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.