Site icon NTV Telugu

Minister Nara Lokesh: వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో, వంగవీటి రాధా కుటుంబ సభ్యులతోనూ మంత్రి నారా లోకేష్ ఆత్మీయంగా ముచ్చటించారు. మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల వంగవీటి రాధా కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్

ఇటీవల టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసింజే. స్వల్పంగా గుండెలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే, గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్టుగా పేర్కొన్నారు రాధా సన్నిహితులు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపుకోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు వంగవీటి రాధా.. ఈ సారి ఎన్నికలో బరి దిగుతారు.. ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగినా.. పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధా.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన విషయం విదితమే.

Exit mobile version