Nara Lokesh: రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ ఠాణా నుంచి రావుతులపూడి నుంచి విద్యార్థులను తీసుకుని బస్సు తునికి ప్రయాణం మొదలయింది. అయితే, కోడూరు సమీపంలో సింగిల్ రోడ్డు ఉండడంతో.. అదే దారిలో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ ఆగిపోయింది. దాంతో బస్సు అక్కడే ఆపేయడంతో ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు బస్సు ముందు దేవర సినిమా పాటలకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోకు మంత్రి నారా లోకేష్ డ్యాన్స్ అదరగొట్టారంటూ ట్వీట్ చేశారు. అయితే, డ్రైవర్ వీడియో బయటకు రావడంతో ఆర్టీసీ అధికారులు విచారణకు ఆదేశించారు. అందులో బస్సు ఎందుకు ఆగిందని?, డ్యాన్స్ వేసిన ఘటనపై ఆరా తీశారు. ఆ తర్వాత ఆయనను సస్పెండ్ చేసారు. ఈ నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బస్సును ఆపిందని లోవరాజు చెప్పారు. ఆ సమయంలో సరదాగా డాన్స్ చేసానని, డ్రైవింగ్ తన పని అని చెప్పాడు. అయితే ట్రాక్టర్ ఆగినప్పుడే బస్సును ఆపినట్లు ఆర్టీసీ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగించారని తెలుసుకున్న మంత్రి లోకేశ్ తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా మళ్లీ స్పందించారు.
Illegal Sand Mining: ఇసుక అక్రమ తవ్వకాలపై సర్కార్ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం..
ఈ సందర్బంగా డ్రైవర్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూనే.. ఆయనకు మరో బంపరాఫర్ కూడా ప్రకటించారు. డ్రైవర్ సస్పెన్షన్ ఆర్డర్స్‌ను ఎత్తివేస్తారని.. ఆయన వెంటనే తన ఉద్యోగంలో చేరొచ్చని తెలిపారు. అలాగే నేను అమెరికా నుంచి రాగానే.. ఆర్టీసీ డ్రైవర్ లోవరాజును పర్సనల్‌గా కలుస్తాను అంటూ ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. ఇక ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు మంత్రి లోకేష్‌పై పెద్దెత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దమనసుతో స్పందించి ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
The suspension orders will be revoked, and he will be taken back to work immediately. I will meet him personally when I come back 😊 https://t.co/netfEfeAo3
— Lokesh Nara (@naralokesh) October 28, 2024
డాన్స్ సూపర్ బ్రదర్! Keep it up! 👏🏻👌🏻
I hope the bus passengers had as great a time watching the performance as I did, without any complaints! 😜😂 https://t.co/n8X7TSSKty— Lokesh Nara (@naralokesh) October 26, 2024