NTV Telugu Site icon

Nara Lokesh: ప్రతీ పెండింగ్‌ ప్రాజెక్టును పరిశీలిస్తా.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పనిచేస్తా..

Lokesh

Lokesh

Nara Lokesh: తాను ఇంకా చార్జ్‌ తీసుకోలేదు.. కానీ, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రతీ ప్రాజెక్టును పరిశీలించి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పనిచేస్తానని తెలిపారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్.. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని, తమ మైనార్టీ నాయకులపై వైసీపీ ముకలు గాయపరిచి దాష్టీకానికి గురి చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Hyderabad: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. గంజాయి సేవించిన డీజే సిద్ధూ..!

అయితే, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సమన్వయతో ఉండమని మమ్మల్ని కంట్రోల్ లో పెట్టారని.. అందుకోసం తాను మరియు శ్రేణులు నోరు మెదపడం లేదన్నారు మంత్రి నారా లోకేష్‌.. ఇక, రెడ్‌ బుక్‌ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరియు మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి తాను స్వయంగా కోరానని.. ప్రణాలికాబద్ధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయాం.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నాం అన్నారు. తాను ఇంకా చార్జి తీసుకోలేదని.. కానీ, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పరిశీలించి.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా పనిచేస్తా.. మా అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పనిచేస్తానని తెలిపారు మంత్రి నారా లోకేష్.