Site icon NTV Telugu

Minister Nara Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అగ్రరాజ్యానికి మంత్రి నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh America Tour: పారిశ్రామికరంగాన్ని గాడిలో పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారంరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ఈనెల 29 న లాస్ వేగాస్ లోని సీజర్స్ ప్యాలెస్ లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ “సినర్జీ” పేరుతో నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేష్ విశిష్ట అతిధిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి IT సేవల పరిశ్రమ నుండి 3వేల చిన్న & మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ITలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ఒక ప్రధాన సదస్సు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్లు జార్జ్ W బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ, షీలా బెయిర్ (FDIC చైర్), జాక్ కాస్ (ఓపెన్ AI) వంటి గౌరవనీయమైన స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేష్ ను విశిష్ట అతిధిగా ఆహ్వానిస్తున్నట్లు సినర్జీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్ట్-అప్‌లకు మద్దతు ఇవ్వడంలో మీ చొరవ ఆర్థికాభివృద్ధిలో ఒక బెంచ్‌మార్క్‌ను ఆవిష్కరించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై సినర్జీ సమావేశంలో మీరిచ్చే విలువైన సందేశం ఔత్సాహితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీ సర్వ్ అలయెన్స్ సంస్థ మంత్రి లోకేష్‌కు పంపిన ఆహ్వానపత్రంలో పేర్కొంది.

Read Also: Cyclone Dana : దూసుకొస్తున్న దానా తుఫాన్.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

అమెరికా కాలమానం ప్రకారం రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన వివరాలిలా ఉన్నాయి.

25-10-2024 (శాన్ ఫ్రాన్సిస్కో)

శాన్ ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ.

పెట్టుబడిదారులు, ఎంటర్ ఫ్రెన్యూర్స్ తో సమావేశం.

26-10-2024 (శాన్ ఫ్రాన్సిస్కో)
పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ.
భారత కాన్సులేట్ జనరల్‌తో భేటీ.
ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో సమావేశాలు.

27-10-2024 (ఆస్టిన్)
ఆస్టిన్‌లోని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ.

28-10-2024 (శాన్ ఫ్రాన్సిస్కో)
రెడ్ మండ్‌లో మైక్రో సాఫ్ట్ ప్రతినిధులతో భేటీ.

29-10-2024 (లాస్ వెగాస్)
ఐటి సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరు, అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీలు.
ఐటి సర్వ్ సినర్జీ సదస్సులో కీలకోపన్యాసం.

30-10-2024 (శాన్ ఫ్రాన్సిస్కో)
గూగుల్ క్యాంపస్ సందర్శన.
స్టార్టప్స్, ఎంటర్ ప్రెన్యూర్స్‌తో భేటీ.
ఇండియన్ సీజీ, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం.
సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ.

31-10-2024 (జార్జియా)
జార్జియా కుమ్మింగ్స్‌లోని శానిమౌంటేన్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.

1-11-2024 (న్యూయార్క్)
న్యూయార్క్ లో పెట్టుబడిదారులతో సమావేశం.

Exit mobile version