పారిశ్రామికరంగాన్ని గాడిలో పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారంరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం.