Site icon NTV Telugu

Minister Nadendla Manohar: ఎన్నికల హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తాం..

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar: కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు తోడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందన్నారు. తెనాలిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టగలిగామన్నారు. ఇప్పటికే 80శాతం గంజాయిని నిర్మూలించామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం, త్వరలోనే వాట్సాప్ నెంబర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Read Also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ.. కల్తీ నెయ్యి అంశంపై వివరణ

Exit mobile version