Site icon NTV Telugu

Nadendla Manohar: ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవు.. దుకాణాల ద్వారానే పీడీఎస్‌ బియ్యం పంపిణీ!

Nadendla Manohar

Nadendla Manohar

రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని, 9 వేలకు పైగా వ్యాన్‌లు ఏర్పాటు చేసి రూ.18 వేల కోట్లు దుర్వినియోగం చేశారని మంత్రి నాదెండ్ల ఫైర్ అయ్యారు. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్‌ మీడియాకు వెల్లడించారు.

Also Read: AP ICET 2025: ఐసెట్‌ ఫలితాలు విడుదల.. విశాఖ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్!

‘గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారు. 9 వేలకు పైగా వ్యాన్‌లు ఏర్పాటు చేసి రూ.18 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. గత ప్రభుత్వ తీరుతో వినియోగదారులకు సమస్యలు వచ్చాయి. బియ్యం ఏ విధంగా రవాణా జరుగుతుందో తనిఖీ చేశాం. రేషన్ కోసం వ్యాన్‌లు తెచ్చిన తర్వాత బియ్యం మాఫియా పెరిగింది. వ్యాన్ డ్రైవర్లు కూడా సిండికేట్‌లో భాగస్వాములు అయ్యారు. ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవు. జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తాం. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తాం. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. దీపం 2 పథకంలో గ్యాస్ సబ్సిడీ నేరుగా వినియోగదారుల ఖాతాలోకి బదిలీ అవుతుంది’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

 

Exit mobile version