Site icon NTV Telugu

Minister Nadendla Manohar: జగన్‌ వర్క్ ఫ్రమ్ బెంగళూరు.. నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు..!

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అధికారాన్ని ఐదేళ్లకు ఇస్తారు.. అది జగన్ మర్చిపోయారా? అని నాదెండ్ల ప్రశ్నించారు. ఇంతకాలం గుంతలు కూడా పూడ్చలేని నాయకుడు.. ఈ రోజు పాలన గురించిమాట్లాడుతున్నాడు అంటూ ఫైర్‌ అయ్యారు. మద్యపాన నిషేధం అంటారు.. కానీ, ఆ హామీ అమలు ఎందుకు కాలేదు అని నిలదీశారు. అయితే, ప్రజలు మాకు అధికారం అభివృద్ధి కోసం ఇచ్చారు.. బటన్‌లు ఎక్కువ నొక్కుతారని కాదు అంటూ ఎద్దేవా చేశారు..

Read Also: AP and Telangana: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. జలవివాదంపై కీలక నిర్ణయాలు..

ద్వీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ పంపిణీ వివరాలు వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మొదటి విడతలో 97 లక్షల మందికి గ్యాస్ పంపిణీ చేశాం.. రూ.846 కోట్లు ఖర్చు చేశాం. .రెండో విడతలో 91.10 లక్షల మందికి పంపిణీ చేశాం.. రూ. 712 కోట్లు ఖర్చయ్యాయి అని వివరించారు. రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు మాట్లాడే జగన్.. రూ.1600 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి ఎలా వెళ్లిపోయారు అంటూ ప్రశ్నించారు. జగన్ పాలనలో ధాన్యం రైతులకు నరకమే చూపించారు.. గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు అని తీవ్రంగా విమర్శించారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు చేస్తూ.. నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు అని ఆరోపించారు.. పవిత్రమైన పంటను రోడ్డుపై వేసి.. ట్రాక్టర్లతో తొక్కించాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.. జగన్ పాలనపై ప్రజలే తీర్పు చెప్పారు.. అందుకే ఆయన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్.

Exit mobile version