NTV Telugu Site icon

Minister Merugu Nagarjuna: చంద్రబాబు గజ దొంగ..! రాజకీయాలకి అనర్హుడు..!

Merugu Nagarjuna

Merugu Nagarjuna

Minister Merugu Nagarjuna: మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల గురించి చంద్రబాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు.. చంద్రబాబు లాంటి గజ దొంగ రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. దళిత ద్రోహి చంద్రబాబు.. దళితుల కోసం చంద్రబాబు పెట్టిన ఒక మంచి కార్యక్రమం గురించి చెప్పగలవా..? అంటూ సవాల్‌ చేశారు.. ఈ నాలుగేళ్లలో 53 వేల కోట్లు దళితుల ఖాతాల్లో నేరుగా సీఎం వైఎస్‌ జగన్ వేశారని వెల్లడించారు. దళితుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్దమా? అంటూ చాలెంజ్‌ చేశారు. దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారు? అని చంద్రబాబు హేళనగా మాట్లాడారు అని మండిపడ్డారు.

Read Also: Ponguleti Srinivasa Reddy : తక్షణమే రైతులను ఆదుకోండి..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కు భారత రత్న ఇప్పించమని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆయనకు దమ్ముంటే ముందు ఎన్టీఆర్ కు భారత రత్న ఇప్పించాలంటూ సవాల్‌ చేశారు మంత్రి నాగార్జున.. దళితుల ఇంగ్లీష్ మీడియంను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.. 29 దళిత నియోజక వర్గాల ఉంటే 28 నియోజక వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తుచేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఆ 29 నియోజక వర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదంటూ జోస్యం చెప్పారు మంత్రి మేరుగ నాగార్జున.

Show comments