అసంతృప్తితో సీఎం వైఎస్ జగన్‌ను వదిలిపెట్టి వెళ్లే వారి వల్ల ఆయనకు ఏం నష్టం జరగదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లి.. మా ప్రత్యర్థి చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని అందరికీ తెలుసన్నారు. మా ప్రభుత్వం నచ్చక ఆమె మాట్లాడుతుందని, ఎవరైనా ఆమె మాటలు నమ్మతారా? అని ప్రశ్నించారు. భావితరాల కోసం పనిచేసే విజనరీ ఉన్న నాయకుడు సీఎం జగన్ అని, తనకు ఓటేయాలని ధైర్యంగా అడగగలిగిన నాయకుడు దేశంలో సీఎం జగన్ ఒక్కరే అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
ప్రకాశంలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ… ‘మా నుంచి పార్టీ బయటకు వెళ్లి, మా ప్రత్యర్థి చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని అందరికీ తెలుసు. మా ప్రభుత్వంపై అసూయతో ఆమె మాట్లాడుతుంది. ఎవరైనా ఆమె మాటలు నమ్మతారా?. వాళ్ల కోసం ఆలొచించే టైం మాకు లేదు. భావితరాల కోసం పనిచేసే విజనరీ ఉన్ననాయకుడు మా నేత సీఎం జగన్. నావల్ల లభ్ది పొందిన వాళ్లు నాకు ఓటేయాలని ధైర్యంగా అడగగలిగిన నాయకుడు దేశంలో సీఎం జగన్ ఒక్కరే. అభివృద్ది అంటే ఏంటో చేసి చూపించాం. కళ్లులేని కబోదులు అభివృద్ది లేదని అంటున్నారు. రాష్ట్ర చరిత్రలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి వస్తే.. అభివృద్ది ఉన్నట్టా? లేనట్లా?’ అని మండిపడ్డారు.
Also Read: Botsa Satyanarayana: 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుంది: మంత్రి బొత్స
‘సామాన్యుల స్దితిగతులు మెరుగుపడ్డాయి. చంద్రబాబు అండ్ బ్యాచ్‌కు తప్ప మిగతా అందరికీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ది కనిపిస్తుంది. అసంతృప్తితో సీఎం జగన్‌ను వదిలిపెట్టి వెళ్లే వారి వల్ల ఆయనకు ఏం నష్టం జరగదు. గతంలో సినీ నటుడు పృధ్వీరాజ్ పార్టీ కోసం ఏం సేవ చేశాడో సమాధానం చెప్పాలి. ఆయనకు గౌరవంగా పదవి ఇస్తే ఏదో చేసి బయటకు వెళ్లాడు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నేను ప్రచారాలు చేస్తా అంటే చేసుకోనివ్వండి.. మేమూ చూస్తాం’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
