Merugu Nagarjuna: నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున.. ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. టార్గెట్ 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్‌లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కొండేపి, మేకతోటి సుచరితకు తాడికొండ, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి విడుదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పచెప్పారు సీఎం జగన్.. అయితే, నియోజకవర్గ మార్పుపై తొలిసారి స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Telangana Speaker: స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు.. అసెంబ్లీకి కేటీఆర్, హరీష్ రావ్
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బొమ్మపై గెలిచాను.. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఎమ్మేల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు.. అందరూ మా వాళ్లే.. అందరూ సీఎం వైఎస్ జగన్ కోసం పనిచేస్తారని ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున. కాగా, తొలి దశలో 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.. వేమూరు సిట్టింగ్‌ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. గ్రూపు తగాదాలున్న కొండేపి విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించారు. కొండెపి ఇన్‌చార్జ్‌గా ఉన్న వరికుటి అశోక్ బాబును.. పార్టీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు హెచ్చరించడంతో.. వరికూటి అశోక్‌బాబుకు వేమూరు బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!