NTV Telugu Site icon

Merugu Nagarjuna: దళితులపై జరిగిన దాడుల విషయంలో చర్చకు టీడీపీ సిద్ధమా..?

Minister Nagarjuna

Minister Nagarjuna

టీడీపీ హయాంలో దళితులపై జరిగిన దాడుల విషయంలో చర్చకు సిద్ధమా? అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎవరైనా దళితుడిగా పుట్టాలి అపుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు టీడీపీ దళితుల ఏమైపోయారు?.. జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేసిన సంక్షేమంపై చర్చకు టీడీపీ రాగలుగుతుందా? అని ఆయన సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వంలో మేము లబ్దిదారులం.. పేద వర్గాలకు ఇళ్ళు ఇస్తుంటే కోర్టుకు వెళ్ళి అడ్డుకోవటానికి చేసిన కుట్రల పై టీడీపీ నేతలు చర్చకు రాగలరా? అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

Read Also: Driverless Cars: ఐఐటీ-హైదరాబాద్ క్యాంపస్‌లో డ్రైవర్‌ లేని కార్లు..

చంద్రబాబు పక్షాన మాట్లాడటానికి టీడీపీ దళిత నేతకు సిగ్గు రావటం లేదా? అని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. నక్కా ఆనంద బాబు ఒళ్ళు బలిసి మాట్లాడకూడదు.. అనంత బాబు విషయంలో కోర్టు ఏ విధానం తీసుకుంటే వైసీపీ అదే విధానాన్ని అనుసరిస్తుంది అని ఆయన అన్నారు. పేద ప్రజలకు ఇళ్లు, స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపిన నీచ చరిత్ర టీడీపీది అని మంత్రి పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియం చదవాలనుకున్న పిల్లలకు ఆ ఛాన్స్ రాకూడదని కోర్టులకు వెళ్లారు.. దళితులకు అసైన్డ్‌ భూములను అప్పగించిన సీఎం జగన్‌ని చూసి మిగతా రాష్ట్రాలు వారి మ్యానిఫెస్టోలో పెట్టుకుంటున్నారు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

Read Also: Australian Fan: లక్నో స్టేడియంలో ఆస్ట్రేలియా అభిమాని హల్చల్.. గణపతి బప్పా మోరియా అంటూ స్లోగన్స్

మా ఆత్మగౌరవమైన అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున పెడుతున్నామని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు ఉండి మా దళితులకు ఏం చేశారు అని ఆయన నిలదీశారు. చంద్రబాబుది కుటిల కులతత్వం.. దళితులకు మేలు జరగాలని చూసే వ్యక్తి సీఎం జగన్‌.. సీఎం జగన్ చేసిన సంక్షేమం వల్లే ఇది సాధ్యమయ్యింది అని మంత్రి అన్నారు. చంద్రబాబులాగ మేము రాజకీయాలను కలుషితం చేయ్యమని ఆయన పేర్కొన్నారు.