NTV Telugu Site icon

Minister Mallareddy: ఏం ముఖం పెట్టుకుని వాళ్లు ఓట్లడుగుతారు..

Mallareddy

Mallareddy

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికలతో బీజేపీ పనైపోయింది..
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంలో ఉన్నారు. దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తున్నా తెలంగాణ రాష్ట్రం మాత్రం అన్ని రాష్ట్రాలకు మోడల్ గా నిలుస్తోంది అని ఆయన కామెంట్స్ చేశారు.

Also Read : Kidnap: కళ్ల ముందే కూతురు కిడ్నాప్.. తట్టుకోలేక రైలుకిందపడి పేరెంట్స్ ఆత్మహత్య

కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఉన్నాయా అంటూ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. వాళ్లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు అంటూ అడిగారు. ఓట్లడిగే కాంగ్రెస్ నేతలను చీపుర్లతో కొట్టండి అని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు తన మాటలనే సెన్సేషన్ డైలాగ్ గా మారుస్తూ.. నిత్యం ప్రజలతో మంత్రి మల్లారెడ్డి మమేకమవుతున్నారు.

Also Read : Jio Cinema: రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్.. జియో సినిమాకు 3.2 కోట్ల వీక్షకులు..

నిజామాబాద్ లో మాయమాటలు విని బీజేపీని గెలిపించుకొన్నారు.. కానీ వచ్చే ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా కవితను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను మంత్రి మల్లారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అందరూ ఆనందంగా ఉన్నారన్న మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి తెలంగాణలో ఉందని తెలిపారు.

Also Read : JD Chakravarthy : వార్నీ.. జేడి చక్రవర్తి ఆ టైపా.. ఒక్కరిని కూడా వదల్లేదా?

బీజేపీ అధికారంలో ఉన్న 17 రాష్ట్రాలలో తెలంగాణ లాంటి అభివృద్ధి ఎక్కడా లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో దళిత బంధు, 24 గంటల విద్యుత్, గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనేలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలలో అధికారం కైవసం చేసుకుంటానని పగటి కలలు కంటున్నాడని మల్లారెడ్డి సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడిగితే చీపురులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచే 10 మంది పేర్లను చెప్పలేని పరిస్థితిలో ఉంది.. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అడిగారు.

Show comments