NTV Telugu Site icon

Minister Malla Reddy : బీజేపీ జూటా పార్టీ.. జూటా నేతలు..

Mallareddy

Mallareddy

అవిశ్వాసంపై గందరగోళం ఉందని, క్యాబినెట్‌లో చట్ట సవరణకు ఆమోదం తెలిపినట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బిల్లులపై గవర్నర్ సంతకాలు చేయాల్సి ఉందని, తాండూరు, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్స్ కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చిందన్నారు. పేకాట విషయంలో కొందరు బీఆర్ఎస్ నేతలు దొరికిన మాట వాస్తవమేనని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందన్నారు మంత్రి మల్లారెడ్డి. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కార్మికులకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందిన ఆయన ఆరోపించారు.

Also Read : IAS’s Transfer : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణ నుంచి వలసలు ఆగిపోయాయని, ఇతర దేశాలకు వెళ్లిన వాళ్లు తిరిగి వస్తున్నారన్నారు. పబ్లిక్ సెక్టార్ ను అమ్మకానికి పెట్టిందని, లక్షల కోట్ల రూపాయల ఎఫ్‌డీలు కార్మిక శాఖ దగ్గర ఉన్నాయని, వాటిని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలన్నారు మంత్రి మల్లారెడ్డి. కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం కట్టబెట్టింది కేంద్రమని ఆయన దుయ్యబట్టారు. ఇప్పుడు అదాని షేర్లు కొన్నవాళ్ళు తలలు పట్టుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. 13 రాష్టాల నుంచి కార్మిక నాయకులు తెలంగాణను సందర్శించి సంతోషం వ్యక్తం చేస్తున్నారని, బీజేపీ జూటా పార్టీ. జూటా నేతలు అంటూ తీవ్ర విమర్శలు చేశారు మంత్రి మల్లారెడ్డి.

Also Read : Gold: పడిపోయిన బంగారం వినియోగం.. కారణం ఇదే..

Show comments