మన్సూర్ అలీఖాన్ తమిళ చిత్రసీమలో 200కి పైగా చిత్రాలలో విలన్ – క్యారెక్టర్ పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశాడు. వివిధ సామాజిక సమస్యల కోసం ఆయన ఎప్పుడూ పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అతని కొడుకు మాత్రం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. తాజాగా ముకపర్ ప్రాంతంలో ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించిన 5 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారి సెల్ ఫోన్ కొని తనిఖీ చేయగా.. అందులో నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీఖాన్ తుగ్లక్ పేరు ఉంది.
VD 12: జెర్సీ చేసిన డైరెక్టరేనా? వీడీ 12 చూసి షాక్.. హైపెక్కించేస్తున్న నాగవంశీ
ఆ తర్వాత ఈ డ్రగ్స్ ఘటనలో అతడికి కూడా సంబంధం ఉందని తేలడంతో గత నెల డిసెంబర్ 4న తుగ్లక్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా.. 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో తుగ్లక్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసుకు సంబంధించి తుగ్లక్ బెయిల్ కోసం గత నెలలో పిటిషన్ దాఖలు చేయగా, యాంటీ నార్కోటిక్స్ డివిజన్ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో మద్రాసు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు కాగా, ఈ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. ఆ సమయంలో అలీఖాన్ తుగ్లక్ నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని, ఇతర నేరస్థులు ఇచ్చిన వాంగ్మూలం మేరకే అరెస్ట్ చేశామని న్యాయమూర్తి ఏడీ జగదీశ్ చంద్ర తెలిపారు. డ్రగ్స్ కలిగి ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో షరతులతో కూడిన బెయిల్‌కు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.