NTV Telugu Site icon

Minister KTR: నేడు మంచిర్యాలలో మంత్రి కేటీఆర్ పర్యటన

Ktr

Ktr

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. ప్రజలను ఆకర్షించేందుకు గులాబీ నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు. మంచిర్యాల, జన్నారంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మరోసారి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. హస్తం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఊదరగొడుతున్న ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరుగురు సీఎంలు మారడం మాత్రం గ్యారెంటీ అని మంత్రి కేటీఆర్ ప్రజలకు వెల్లడిస్తున్నారు.

Read Also: Pat Cummins: ఈ విజయం అతడి వల్లే.. టాస్ ఓడిపోవడం కలిసొచ్చింది: కమిన్స్

ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, మొన్నటి వరకు బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన కేటీఆర్.. తాజాగా రోడ్ షోలు స్టార్ట్ చేశారు. అలాగే, హైదరాబాద్ ​లో మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రోడ్ షోలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్​, బీజేపీలపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలించిన సమయంలో తెలంగాణకు చేసిన అభివృద్ధి శూన్యమంటూ ఆయన చెబుతున్నారు.

Show comments